పాములా ఉన్న చేప : దీని ధర రూ.13వేలు

Submitted on 10 January 2019
Rare Fish Price Rs. 13,000 in pune

ముంబై : మహారాష్ట్రలో అరుదైన చేప ఏకంగా రూ. 13,000 పలికింది. మార్కెట్‌లో సగటున చేపలు కిలో 230 రూపాయలు పలుకుతుండగా ఆరున్నర కేజీలున్న ఈ చేప మాత్రం 10 రెట్లకు పైగా ధర పలకడం విశేషం. పుణె జిల్లా ఇందాపుర్‌ తాలూకా బాభుల్‌గావ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లగా స్థానిక ఉజానీ రిజర్వాయర్‌లో వారికి అహెర్‌ జాతికి చెందిన చేప దొరికింది. దాన్ని వారు ఓ వ్యాపారికి విక్రయించగా అతను ఇందాపుర్‌ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. చేపను కొనేందుకు ఒక్కసారిగా జనం ఎగబడటంతో ఆ వ్యాపారి రూ. 2,000 నుంచి వేలం పాట ప్రారంభించారు. దీంతో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ చేపకు అంత ప్రత్యేకత ఎందుకంటే.. దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ఈ రకం చేపలు మార్కెట్‌లోకి వచ్చినప్పుడల్లా జనం ఎగబడి కొంటుంటారు. 
 

Rare Fish
Price Rs. 13
000
pune
maharastra

మరిన్ని వార్తలు