గృహం డైరెక్టర్‌తో

Submitted on 19 February 2019
Rana Daggubati teams up with Milind Rau-10TV

రానా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమా ఫిబ్రవరి 19 న విడుదలైంది. 2019 ఫిబ్రవరి 19 నాటికి రానా హీరోగా పరిచయం అయ్యి 9 ఏళ్ళవుతుంది. ఈ తొమ్మిది సంవత్సరాలలో తెలుగుతో పాటు, హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసాడు. బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి : ది కన్‌క్లూజన్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రిలో రాజకీయ నాయకుడిగా, ఘాజీలో నేవీ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. త్వరలో, ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌లోనూ అలరించనున్నాడు. రానా ప్రస్తుతం హథీ మేరీ సాథీ, హౌస్‌ఫుల్ 4 సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గృహం వంటి థ్రిల్లర్‌తో ఆడియన్స్‌‌ని థ్రిల్‌కి గురిచేసిన యంగ్ డైరెక్టర్ మిలింద్ డైరెక్షన్‌లో రానా సినిమా చెయ్యబోతున్నాడు.  

విశ్వశాంతి ఫిలింస్ బ్యానర్‌పై ఆచంట గోపీనాథ్ నిర్మించబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ భాషా సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన గోపీనాథ్, కొంత గ్యాప్ తర్వాత నయనతార ఇమైక్క నొడిగల్ సినిమాని తెలుగులో అంజలి సి.బి.ఐ. పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు రానాతో తెలుగులో సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్, డైలాగ్ వెర్షన్ పూర్తయిందట. 2019 ఆగష్ట్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Rana Daggubati
Gopinath Achanta
Milind Rau

మరిన్ని వార్తలు