రానాబాబు నారాబాబుగా ఎలా మారాడంటే...

Submitted on 20 February 2019
Rana Daggubati as Nara Chandrababu Naidu-10TV

నటసింహ నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, భరత్ రెడ్డి, సచిన్ కేద్‌కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన, ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్.. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న గ్రాండ్‌గా రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే, సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవు.. గత రెండు రోజులుగా న్యూ పోస్టర్స్, రిలీజ్ ప్రోమోస్ రిలీజ్ చేస్తున్న మూవీ యూనిట్, రీసెంట్‌‌గా.. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేస్తున్న రానా మేకోవర్ వీడియోని రిలీజ్ చేసింది.

హెయిర్ స్టైల్, మీసాలు, బాడీ లాంగ్వేజ్.. ఇలా, రానా బాబు నారాబాబుగా మారడం వెనక ఎంత కష్ట పడ్డాడో ఆ వీడియోలో చూడొచ్చు. తండ్రి సురేష్ బాబు కూడా రానాకి సలహాలిస్తూ సహాయం చేసాడు. క్రిష్, చంద్రబాబు క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం, రానా ఆ క్యారెక్టర్ కోసం పెట్టిన ఎఫర్ట్.. మహానాయకుడిలో ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి..
వాచ్ వీడియో...

Nandamuri Balakrishna
Vidya Balan
Nandamuri Kalyan Ram
Rana Daggubati
Krish

మరిన్ని వార్తలు