బాబాయ్ ఓటమిపై స్పందించిన అబ్బాయ్

Submitted on 24 May 2019
RamCharan About PawanKalyan & JanaSena Party  AP Elections 2019

ఏపీలో 2019 ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో, ఫలితాల నేపథ్యంలో ఎంతటి ఉత్కంఠత నెలకొందో తెలిసిందే. ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టగా, టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక, ప్రశ్నిస్తా.. అంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం, జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలవడం పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి స్పందించాడు.

'గొప్ప నాయకులందరూ  లీడర్లు అవ్వాలనుకోరు.. మార్పు తీసుకురావడం కోసమే వాళ్ళుంటారు, ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో నీ పాత్ర ఏంటనేది కాదు, నీ లక్ష్యం ఏంటనేదే ముఖ్యం, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరపున కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ రామ్ చరణ్ స్పందించాడు.

ramcharan
PawanKalyan
JanaSena Party
ap elections 2019

మరిన్ని వార్తలు