వీడిన రాంప్రసాద్ మర్డర్ మిస్టరీ : డబ్బు కోసమే హత్య, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం

Submitted on 15 July 2019
ram prasad murder mystery ends

సంచలనం రేపిన వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. వ్యాపార లావాదేవీలే మర్డర్ కి కారణం అని పోలీసులు నిర్దారించారు. రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం అని చెప్పారు. ఈ కేసు వివరాలను జాయింట్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కోగంటి సత్యం, శ్యామ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. రాంప్రసాద్ హత్య కేసులో 11మంది నిందితులు ఉన్నారని చెప్పారు. ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఆరుగురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

మృతుడు రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారని డీసీపీ చెప్పారు. కోగంటి సత్యం.. రాంప్రసాద్ కు రూ.70 కోట్లు బాకీ పడ్డారని, రూ. 23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేసుకున్నారని వెల్లడించారు. పథకం ప్రకారమే రాంప్రసాద్ మర్డర్ జరిగిందన్నారు. హత్యకు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించారని తెలిపారు. రాంప్రసాద్ గుడి నుంచి వస్తుండగా నలుగురు అటాక్ చేసి మర్డర్ చేశారని జాయింట్ సీపీ చెప్పారు. ఈ మర్డర్ కేసులో ఏ1గా కోగంటి సత్యనారాయణ పేరుని చేర్చామన్నారు.
Also Read : జైలులో జ్యోతిష్యం నేర్చుకుంటున్న ఎన్డీ తివారీ కోడలు

సత్యం విజయవాడలో కామాక్షి స్టీల్స్‌ నిర్వహించేవారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా భాగస్వామి. ఆయన తన వాటాను రాంప్రసాద్‌కు విక్రయించారు. 2013 వరకు రాంప్రసాద్‌ కామాక్షి స్టీల్‌ వ్యాపార లావాదేవీలను చూశారు. 2013లో సత్యం లెక్కలు చూడగా భారీ వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించి రాంప్రసాద్‌ను ప్రశ్నించారు. అప్పటి నుంచి వారి మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రూ.70 కోట్లు తేడా వచ్చినట్లు గుర్తించిన సత్యం.. రాంప్రసాద్‌పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. చివరికి రూ.23 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదరగా.. రాంప్రసాద్‌ ఆ డబ్బు కూడా ఇవ్వలేదు.

ఘర్షణలు, పరసర్పర కేసులు ఎక్కువ కావడంతో 2015లో రాంప్రసాద్‌ హైదరాబాద్‌ వచ్చారు. పంజాగుట్టలో అభిరామ్‌ స్టీల్స్‌ పేరుతో ఫ్యాక్టరీ కార్పొరేట్‌ కార్యాలయాన్ని తెరిచారు. కాగా, 2 నెలల క్రితం సత్యం ప్రయాణిస్తున్న వాహనానికి గుంటూరు జిల్లాలో ప్రమాదం జరిగింది. తర్వాత అది సాధారణ ప్రమాదం కాదని, హత్యాయత్నమని తెలుసుకున్నారు. డబ్బులు ఇవ్వకపోగా తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, ఎలాగైనా రాంప్రసాద్‌ను అంతం చేయాలని కొద్ది నెలల క్రితమే కోగంటి సత్యం నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ పనిని తన ప్రధాన అనుచరుడు శ్యామ్‌కు అప్పగించాడని, అతడు తన అనుచరులతో కలిసి పంజాగుట్ట దగ్గర రాంప్రసాద్ ని మర్డర్ చేశారని పోలీసులు వివరించారు.
Also Read : మిస్టరీ ఏంటీ : శివాలయంలో ముగ్గురి దారుణ హత్య, రక్తంతో శివుడికి అభిషేకం

ram prasad
murder
Mystery
Koganti Satyam
Money
Hyderabad

మరిన్ని వార్తలు