యంగ్ డైరెక్టర్‌తో రామ్ సినిమా

Submitted on 15 February 2019
Ram next film with Sagar Chandra-10TV

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు, రామ్ తన తర్వాత సినిమాని కూడా లైన్‌లో పెట్టాడని తెలుస్తుంది. నారా రోహిత్, శ్రీ విష్ణు నటించిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ చంద్ర.. ఈ మధ్యే రామ్‌ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడట.. లైన్ విని ఎగ్జైట్ అయిన రామ్, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకో, సినిమా చేద్దామని చెప్పాడట..

అంతేకాదు, ఈ సినిమాని తన హోమ్ బ్యానర్, స్రవంతి మూవీస్ లోనే చేద్దామని కూడా చెప్పాడట.. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యాక, జూన్‌లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.. సాగర్ చంద్ర  ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట.. ఇస్మార్ట్ శంకర్.. మే లో రిలీజ్ కానుంది.. 

Ram
Sagar Chandra
ISmart Shankar
Ram with Sagar Chandra

మరిన్ని వార్తలు