భారత్-పాక్ మ్యాచ్ లో రకుల్,మంచు లక్ష్మీ సందడి

Submitted on 16 June 2019
rakulpreet singh,manchu laxmi enjoying india, pak match

వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ(జూన్-16,2019)ఇంగ్లాండ్ లోని  మాంచెస్టర్‌ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పలువురు సెలబ్రిటీలు లైవ్ తిలకిస్తూ సందడి చేస్తున్నారు.ఈ మ్యాచ్‌ ను టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తూ  గ్యాలరీలో తెగ ఎంజాయ్ చేస్తోంది.

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచులక్ష్మీతో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది.భారత్‌కు మద్దతుగా జాతీయ జెండాతో ఈ ఇద్దరూ స్టేడియంలో సందడి చేశారు. మంచు లక్ష్మి,రకుల్ ని చూసి అక్కడున్న భారత అభిమానులు కూడా హుషారుగా భారత్‌ కు మద్దతు తెలిపారు.

india
Pak
Match
rakulpreet singh
manchu laxmi
Enjoying
england
World Cup


మరిన్ని వార్తలు