సెన్సార్ అభ్యంతరం.. రక్తం- ది బ్లడ్ ట్రైలర్..

Submitted on 13 February 2019
RAKTHAM (THE BLOOD) TRAILER-10TV

నా బంగారు తల్లి చిత్రానికి గానూ నేషనల్ అవార్డు అందుకున్న రాజేష్ టచ్‌రివర్, తన భార్య సునీతా కృష్ణన్ నిర్మాణంలో రూపొందించిన సినిమా.. రక్తం.. ది బ్లడ్.. ఇప్పటికే ఐదు ఇంటర్ నేషనల్ అవార్డ్స్‌తో పాటు, మరో ఐదు ఇతర నామినేషన్లకు ఎంపికై, పలువురి ప్రశంసలందుకున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసారు. బెనర్జీ, మధుశాలిని, సన, సంజూ శివరామ్ తదితరులు నటించారు. రక్తం సెన్సార్ విషయంలో, దర్శకుడు.. సెన్సార్ టీమ్ తెలిపిన అభ్యంతరాలపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు.. తాను ఎటువంటి అసభ్యతలకీ తావు లేకుండా, మానవీయ కోణంలో తెరకెక్కించిన  ఈ సినిమా విషయంలో సెన్సార్ వాళ్ళు చెప్పిన కట్స్, సినిమాకే నష్టం కలిగిస్తాయి. 

సామాజిక పరివర్తన కోసం రక్తం చిందించడం అవసరమా? అనే సాఫ్ట్ పాయింట్‌తో ఈ సినిమా తీసాను.. నేను చెప్పేది సెన్సార్ వాళ్ళు వినట్లేదు కాబట్టి, నేను ట్రిబ్యునల్‌కి వెళ్తాను.. అంటున్నాడు దర్శకుడు రాజేష్.. సెన్సార్ విషయంలో క్లారిటీ వచ్చాక రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు..

వాచ్ ట్రైలర్...

Benerjee
Madhushalini
Sana
Sunitha Krishnan
Rajesh Touchriver

మరిన్ని వార్తలు