జెర్సీ రంగు మార్చుకుని బరిలోకి దిగనున్న ఐపీఎల్ జట్టు

Submitted on 11 February 2019
rajasthan royals jersey color changed as pink


ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్‌కు సిద్ధమైపోతుంది. ముందుగా తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న జట్లు, జట్ల పేర్ల మార్పు, జెర్సీల్లో మార్పులు చేసుకుని సరికొత్త హంగుల్తో ఐపీఎల్ 2019కి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్ కాగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు జెర్సీ రంగు మార్చుకుని పింక్ కలర్ దుస్తుల్లో కనిపించనుంది. 

రెండేళ్ల పాటు నిషేదం అనుభవించి 2018సీజన్లో పున:ప్రవేశం చేసిన రాజస్థాన్ తొమ్మిది సీజన్ల వరకూ బ్లూ కలర్ జెర్సీతోనే కనిపించింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింకా రహానె, బ్రాండ్ అంబాసిడర్ షేన్ వార్న్‌లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేర గతేడాది ఒక మ్యాచ్‌లో క్యాన్సర్‌పై అవగాహన కోసం పింక్ కలర్ దుస్తుల్లో కనిపించింది. దానికి వచ్చిన స్పందనను బట్టి తమ జట్టు పింక్ కలర్‌లో కనిపిస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ రహానె పేర్కొన్నాడు. 
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ద్వారా జెర్సీతో ఉన్న వీడియోను పంచుకుంది. 'జైపూర్ అంటేనే పింక్ సిటీగా పేరు. అందుకే మేం పింక్‍‌లో కనిపించాలనుకుంటున్నాం. పింక్ కలర్ ధరించేందుకు ఆటగాళ్లు సంతృప్తిగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది పింక్‌లో అదరగొట్టేందుకు జట్టు సిద్ధమవుతోంది' అని జట్టు అంబాసిడర్ అయిన షేన్ వార్న్ తెలిపాడు. 


గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సైతం పేరు మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసి మానుకుంది. ఆ తర్వాత ఆ జట్టు నుంచి వీరేందర్ సెహ్వాగ్ తప్పుకోవడంతో మేనేజ్‌మెంట్‌లో మార్పులొచ్చాయి. 

rajasthan royals
IPL
IPL 2019

మరిన్ని వార్తలు