వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

Submitted on 18 April 2019
Rajasthan, an embryo of 3 kg of an 8 year-old child came out of the stomach

బికనీర్ (రాజస్థాన్) : ఆ బాలుడికి 8 ఏళ్లు.. తోటి చిన్నారులతో ఆడుకోలేని పరిస్థితి. పుట్టిన ఏడాది నుంచే అతడి కడుపు ఉబ్బిపోతూ వస్తోంది. లేవలేడు. కూర్చొలేడు. తినాలంటే కూడా కష్టమే. పిల్లాడు పెరుగుతున్నా కొద్ది అతడి కడుపు కూడా పెరిగిపోతోంది. ఏమైందో తెలియదు. అంతుపట్టని వ్యాధి అనుకున్నారంతా. ఎన్నో మందులు వాడారు. చివరికి DB ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా.. బాలుడికి వైద్య పరీక్షలు చేశారు.

స్కానింగ్ లో వచ్చిన రిపోర్ట్ చేసి ఆస్పత్రి వైద్యులు షాక్ అయ్యారు. తొలుత బాలుడి కడుపులో ఉన్నది పెద్ద కణితి (ట్యుమర్) ఉందని అనుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కిలోల బరువు ఉంది. ఇంతకీ ఇది కణితి.. పిండమా? నిర్ధారించేందుకు కొన్ని వైద్యపరీక్షలు చేశారు. 
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం

ఈ పరీక్షల్లో బాలుడి కడుపులో పిండం ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో జరిగింది. బాలుడు పేరు.. దినేశ్. మూండా గ్రామానికి చెందిన జగదీశ్ మెఘ్వాల్ కుమారుడు. బాలుడి కడుపులో ఉన్న పిండానికి తల, కాలి ఎముకలు, పొడవైన జుట్టు, రక్త నాళాలు, అవయవాలు అసంపూర్తిగా ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

రోజురోజుకీ అతడి కడుపు ఉబ్బిపోతుండటంతో వెంటనే దినేశ్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. లేదంటే అతడి ప్రాణానికే ప్రమాదమని అన్నారు. వెంటనే బాలుడిని ఆపరేషన్ థియేటర్ కు తరలించిన డీబీ ఆస్పత్రి వైద్య బృందం 6 గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. అనంతరం బాలుడి కడుపులోని 3 కేజీల పిండాన్ని విజయవంతంగా తొలగించారు. దినేశ్ ను ఐసీయూలోకి తరలించిన వైద్యులు.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారుల్లో చాలా అరుదుగా ఇలాంటి వ్యాధి వస్తుందని చెప్పారు. తల్లి గర్భంలో ఉన్న సమయంలో కవల పిల్లలకు అరుదుగా జరుగుతుంది. కొన్నిసార్లు కవల పిల్లల్లో ఒకరి కడుపులో మరో పిండం పెరుగుతుంటుంది. తల్లి గర్భంలో పిండం  పెరుగుతున్నప్పడు.. అదే సమయంలో కవలల కడుపులో పిండం కూడా పెరిగి ఉండవచ్చునని వైద్యులు నిర్ధారించారు.

5 లక్షల చిన్నారుల్లో ఒకరికి ఈ ఇలాంటి సమస్య ఉంటుందని వైద్యులు చెప్పారు. ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అన్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్ ఎప్పుడూ జరుగలేదన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా తమ పిల్లాడికి పెద్ద ఆపరేషన్ చేసిన డిబి ఆస్పత్రి వైద్యులకు పేదవారైన దినేశ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 
Also Read : పెళ్లి అలంకరణతో ఓటు వేసిన నవ దంపతులు

Stomach
embryo
Dibi Hospital
baby's stomach
Dinesh of Jagdish  

మరిన్ని వార్తలు