రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు

Submitted on 16 May 2019
rains predicted in telangana today

తెలంగాణ రాష్ట్రంలో క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. మే 16వ తేదీ గురువారం కూడా పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, కరీంనగర్ తదితర కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 17 నుంచి మే 19 తేదీల్లో కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక మే 15వ తేదీ బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయని వెల్లడించింది. రామగుండం, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. 

Rains
predicted
Telangana Today
Weather Report
Telangana Weather Updates

మరిన్ని వార్తలు