మీరే మా బాస్ : రాహుల్ గాంధీ రాజీనామా తిరస్కరణ

Submitted on 25 May 2019
Rahul Gandhis Resignation Rejected At Top Congress Meet

కేంద్రంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే సీడబ్ల్యూసీ నేతలు రాహుల్ రాజీనామాను తిరస్కరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశమైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యంపై సీడబ్ల్యూసీలో నేతల చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ పదవికి రాజీనామా సమర్పించేందుకు రాహుల్ సిద్ధపడగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు అవసరం లేదన్నారు. 

ఈ భేటీకి యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, మల్ల్లికార్జునఖర్గే, పంజాబ్‌ సీఎం అమరిందర్ సింగ్‌, పి. చిదంబరం, సిద్దరామయ్య తదితర నాయకులు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఓటమికి కారణాలు, భవిష్యత్‌ కార్యచరణపై నేతలు సమావేశంలో చర్చిస్తున్నారు. సీడబ్ల్యూసీ... కాంగ్రెస్ పార్టీలోని కీలక విభాగం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. 
 
పార్టీ ఓటమికి గల కారణాలతో అన్వేషించడంతో పాటు... పార్టీకి ఓట్లు వేసేలా ప్రజలను తమ హామీలు ఎందుకు ఒప్పించలేకపోయాయన్న దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ సాధించిన 44 స్థానాలతో పోలిస్తే.. 2019లో కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ... కేవలం 52 సీట్ల దగ్గరే ఆగిపోయింది. 18 రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఎన్నికల ఫలితాలకు ముందు కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి మెజార్టీ రాదని, హంగ్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది. అందుకు భిన్నంగా బీజేపీ దుమ్మురేపింది. ఒక్క బీజేపీనే 300కు పైగా ఎంపీ సీట్ల సాధించింది.

Rahul gandhi
resignation
rejected
Top Congress Meet
cwc
defeat
Sonia Gandhi

మరిన్ని వార్తలు