రేడియో ‘చిన్నమ్మ’ కన్నుమూత

Submitted on 18 January 2019
Radio Artist Nirmala Vasanth Passed Away

నిర్మలా వసంత్... ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదుగానీ, రేడియోలో 'పాడిపంటలు చిన్నమ్మ' అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వ‌స్తుంది. నిర్మలా వసంత్ పల్లెటూరి అమాయక మహిళ. దశాబ్దాలుగా పాడి పంటలు కార్యక్రమం ద్వారా రైతుల సందేహాలను తన గొంతులో వినిపిస్తూ అందరినీ మెప్పించారు. పల్లెటూరి యాసతో రైతులకు చేరువయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మందిని అలరించిన నిర్మలా వసంత్ గురువారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా ఆమె మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.
ఈ నెల 8న కూడా ఆమె ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకాశవాణి కేంద్రం వ్యవసాయ విభాగానికి కొండంత అండగా నిలిచిన చిన్నమ్మ అంటూ నిర్మలమ్మకు రేడియో సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నిర్మలా వసంత్‌ పల్లెటూరి యాసతో పాడిపంటకు జీవం పోశారని ప్రోగ్రాం స్టాఫ్‌ అసోసియేషన్‌ జాతీయ నాయకుడు వలేటి గోపీచంద్‌ కొనియాడారు. ఆమెను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ ఆకాశవాణి ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
  

Nirmala Vasanth
Akasavani
Padi Panta

మరిన్ని వార్తలు