IIT బాంబేకు 34వ ర్యాంకు : ఆసియా టాప్ 100లో 8 భారతీయ యూనివర్శిటీలు

Submitted on 28 November 2019
QS Rankings, India universities, Asia top 100, IIT Bombay 34 Rank, Mainland China, India

ప్రపంచ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ (QS)లో ఆసియా నుంచి టాప్ 100 ర్యాంకుల్లో 8 భారతీయ యూనివర్శిటీలకు చోటు దక్కింది. ఆసియాలో మొత్తం 550కు పైగా యూనివర్శిటీలు పోటీపడగా.. 96 భారతీయ యూనివర్శిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో 20 బ్రాండ్ యూనివర్శిటీలు కొత్తగా చేరాయి. ఆసియా ఖండంలో ఇండియా కంటే పొరుగుదేశమైన చైనా మాత్రమే 118 యూనివర్శిటీలతో ఉత్తమ ర్యాంకును సాధించింది. 2019 ఏడాదిలో టాప్ 10 యూనివర్శిటీల్లో మెయిన్ ల్యాండ్ చైనా 4 యూనివర్శిటీలతో నిలిచింది. కానీ, భారత్ మాత్రం టాప్ 30లో ఒక యూనివర్శిటీకి కూడా చోటు దక్కలేదు. 

ఆసియాలో యూనివర్శిటీ ర్యాంకింగ్ జాబితాలో మొత్తం 96 భారతీయ యూనివర్శిటీలు చోటు దక్కించుకోగా అందులో టాప్ 100లో 8 భారతీయ యూనివర్శిటీలు, టాప్ 250లో 31వ స్థానంలో నిలిచాయి. 2018 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యూనివర్శిటీ ర్యాంకులు 31, 18 స్థానాలకు పడిపోయాయి.

అందులో మరో 12 యూనివర్శీటీలు మెరుగైన స్థితిలో నిలవగా ఒక యూనివర్శిటీ మాత్రమే స్థిరమైన ర్యాంకులో నిలిచింది. వీటిలో అత్యుత్తుమ ప్రదర్శనతో ఇండియా నుంచి ఐఐటీ బాంబే యూనివర్శిటీ ఒక స్థానం కోల్పోయి 34వ ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ 43వ ర్యాంకులో ఉండగా, ఐఐటీ మద్రాసు 50వ ర్యాంకులో నిలిచింది.

 11 మెట్రిక్స్ ఆధారంగా మెథడాలజీతో QS ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు. అకాడమిక్ రిప్యూటేషన్ ఇండికేటర్‌లో భారతీయ యూనివర్శిటీగా IIT బాంబే అత్యుత్తమ యూనివర్శిటీగా చోటు దక్కింది. యూనివర్శిటీ నైణ్యతను బట్టి 94వేల ఎకాడమిక్స్‌కు సంబంధించి ప్రావీణ్యాన్ని పరిశీలిస్తారు. ఈ పరిమాణం కింద ఆసియాలో 32వ ర్యాంకులో ఐఐటీ బాంబే నిలవగా, ఐఐటీ ఢిల్లీ (34వ ర్యాంకు), యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ (50వ ర్యాంకు)తో తర్వాతి ర్యాంకులో నిలిచాయి.

మరోవైపు ఎంప్లాయిర్ రెప్యుటేషన్ ఇండికేటర్‌ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ల నాణ్యతను పరిశీలించగా ఆసియాలో ఐఐటీ బాంబే 21వ ర్యాంకులో నిలిచింది. టాప్ 50వ ర్యాంకులో నిలిచిన 4 భారతీయ యూనివర్శిటీల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాసు, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్ పూర్ చోటు దక్కించుకున్నాయి.

QS Rankings: 8 India universities in Asia top 100
IIT Bombay 34th

మరిన్ని వార్తలు