సులేమానీ హత్య... పూసగుచ్చినట్లు వివరించిన ట్రంప్

Submitted on 19 January 2020
Qassim Suleimani targeted for saying bad things about US: Trump

బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద్దిసేపటి ముందు ఏం జరిగింది,డ్రోన్ ఆపరేషన్‌లో సులేమానీ ఎలా మృతి చెందిందీ అనే విషయాలను ట్రంప్ బహిర్గతం చేశారు.

2020 అధ్యక్ష ఎన్నికల కోసం నిధులు సమీకరించేందుకు శుక్రవారం(జనవరి-17,2019) ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లోని తన మార్-ఏ-లాగో క్లబ్ వద్దనున్న బాల్ రూమ్ లో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కార్యక్రమంలో అక్కడికి వచ్చినవారితో ట్రంప్ ఈ వివరాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ తమ దగ్గర ఉందని అమెరికాకు చెందిన ఓ పత్రిక తెలిపింది.
 
అమెరికా బలగాలు తనతో...సర్, వాళ్లందరూ ఒకే కారులో ఉన్నారు. ఇక వాళ్లకి 2 నిమిషాల 11 సెకన్లే మిగిలి ఉన్నాయి. నో ఎమోషన్. వాళ్లు ఆయుధాలు ఉన్న కార్లో ఉన్నారు. సర్ వాళ్లకి జీవించడానికి ఇంకా మిగిలింది 1 నిమిషం మాత్రమే. సర్. 30 సెకెన్లు... 9, 8, 7..’ అంటూ మిలటరీ అధికారులు ఎప్పటికప్పుడు తనతో సమాచారం పంచుకున్నారని ట్రంప్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారితో అన్నారు. ఆ తరువాత ‘బూమ్’ అంటూ పెద్ద శబ్దం వినబడిందని ఆయన అన్నారు. అనంతరం.. టార్గెట్ పూర్తైందని ఓ మిలటరీ అధికారి చివరిగా తనకు చెప్పారని ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ లోని సిస్ట్యువేషన్ రూమ్ నుంచి సీన్ అంతా తాను మానిటర్ చేసినట్లు ట్రంప్ తెలిపారు. 


మరోవైపు.. ఖాసిం మృతిపై అమెరికాలో మరో వివాదం చెలరేగింది. ఖాసిం వల్ల అమెరికన్లకు ప్రమాదమని ప్రకటించిన ట్రంప్.. అందుకు సంబంధించిన వివరాలు బహిరంగంగా వెల్లడించకపోవడంపై కొందరు సెనెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాపై తప్పుగా ఖాసిం నోరు పారేసుకోవడంతోనే అతడిని చంపేసినట్లు ట్రంప్ అన్నట్లు వార్తలు రావడంతోనే ఈ వివాదం మొదలైంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హైచ్చరించిన ఒక రోజు తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ పట్ల ఆయతుల్లా ఖమైనీ పరుష పదజాలం వాడినట్లు తెలుస్తోందని,మాటలు జాగ్రత్త’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. 

Qassim Suleimani
TARGETED
usa
trump
Drone Attack
REPUBLICAN EVENT
BAD THINGS

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు