వణుకుపుట్టించే వీడియో : భీకర పోరాటం.. మొసలిని మింగేసిన కొండచిలువ

Submitted on 15 July 2019
Python Swallows Australian Freshwater Crocodile After Battle

కొండచిలువ.. మొసలి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? రెండెంటిలో ఎవరూ గెలుస్తారు? అంటే ఏం చెబుతారు? టక్కున మొసలే గెలుస్తుందని అంటారు. అవునా? కానీ, ఇక్కడ మొసలి కాదు.. భారీ కొండచిలువే గెలిచింది. కొన్ని క్షణాల పాటు సాగిన భీకర పోరులో మొసలిని అమాంతం కొండ చిలువ మింగేసింది.

ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలో ఫ్రెష్ వాటర్ లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్వీన్స్ లాండ్ లోని మౌంట్ ఇషాలో కయేకర్ అనే వ్యక్తి ఈ ఫొటోలను తీయగా జీజీ వైల్డ్ లైఫ్ రెస్య్కూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
Also Read : షాకింగ్ యాక్సిడెంట్ : గాల్లోకి ఎగిరి చెట్టుపై చిక్కిన కారు

ఆస్ట్రేలియాలోనే రెండో అతిపెద్ద కొండచిలువ, పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రెష్ వాటర్ లో కనిపించే అలిగేటర్.. రెండూ భీకరంగా పోట్లాడాయి. ఈ పోరులో చివరికి కొండచిలువే గెలిచింది. మొసలి కొండచిలువకు ఆహారమైంది. సాధారణంగా కొండచిలువలు తమ నోటిని అవసరమైన మేరకు సాగదీసే స్వభావం ఉంటుంది.

అందుకే పెద్ద జంతువులను జింక, మొసళ్లు, మనుషులను కూడా అమాంతం మింగేయగలవు. ఆస్ట్రేలియాలో కనిపించే భారీ కొండచిలువ.. 13 అడుగుల పొడవు పెరుగుతుంది. 2017లో ఇండోనేషియాకు చెందిన వ్యక్తిని 23అడుగుల పొడవైన కొండచిలువ మింగేసింది. వణుకుపుట్టించేలా ఉన్న ఈ ఫొటోల్లో భారీ కొండచిలువ.. మొసలిని ఎలా మింగేస్తుందో చూడండి.  
Also Read : దేవుడిలా వచ్చాడు : పసిపాప ప్రాణం కాపాడిన పోలీస్

Python
Australian Freshwater
Crocodile
Mount Isa
crocodylus Johnstoni 

మరిన్ని వార్తలు