ఇండియా ఫస్ట్ : ఈ బస్సుకు డ్రైవర్ అక్కర్లేదు : రూ. 6 లక్షలే! 

Submitted on 7 January 2019
Punjab Students,  Driverless Solar-Powered Bus

నేటి విద్యార్థులే రేపటి పౌరులు అనే మాటను అక్షరాలా నిజం చేశారో పంజాబ్ కు చెందిన విద్యార్థులు.. తమ ఆలోచనలకు పదనుపెడితే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ విద్యార్థులు నిరూపించారు. లవ్ లీ ప్రొఫెసనల్ యూనివర్సిటీ (ఎల్ పీయు) విద్యార్థులు భారత్ లోనే తొలి డ్రైవర్ లెస్ స్మార్ట్ బస్సును సృష్టించారు. సోలార్ పవర్ తో పనిచేసే ఈ బస్సుకు డ్రైవర్ అక్కర్లేదు. సూర్యుడే డ్రైవర్. ఇందనంతో నడిచే బస్సులతో ఎయిర్ పొల్యుషన్ ఉంటుంది. సోలార్ పవర్ తో నడిచే ఈ బస్సుకు ఎయిర్ పొల్యుషన్ అనేది ఉండదు. ఇటీవల ఈ బస్సును 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్ సీ) ఎడిషన్ కార్యక్రమంలో  ప్రదర్శించారు. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ.. కేవలం రూ. 6 లక్షలు మాత్రమేనట. సోలార్ నుంచి వెలువడే శక్తిని ఇది తీసుకొని ఇందన శక్తిగా మార్చుకునే టెక్నాలజీని ఇందులో రూపొందించారు.

జలంధార్ లో ఈ ఈవెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.  సోలార్ బస్సును అత్యాధునిక ఫీచర్లను రూపొందించేందుకు 12 నెలల సమయం పట్టింది. గంటకు 30 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి చార్జ్ చేస్తే చాలు.. 10 మంది నుంచి 30 మందిని 70 కిలోమీటర్ల మేర ట్రావెల్ చేయగల కెపాసిటీ ఇది సొంతం. మరో విశేషం ఏమిటంటే.. సోలార్ బస్సులో జీపీఎస్, బ్లూ టూత్ కూడా ఉంది. 10 మీటర్ల దూరంలో ఈ బస్సు ఎక్కడ ఉన్నా దీని నేవిగేషన్ ఆధారంగా కంట్రోల్ చేయొచ్చు.  సోలార్ బస్సు సాధారణ ప్యాసింజర్ బస్సుల కంటే.. ఎయిర్ పోర్టుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏడాది ఆఖరిలో వాణిజ్య సర్వీసుల్లోకి సోలార్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.  

Punjab Students
 Driverless Solar-Powered Bus

మరిన్ని వార్తలు