ఉగ్రదాడి : భార్యతో ఫోన్ మాట్లాడుతునే జవాన్ మృతి 

Submitted on 16 February 2019
in pulwama Attack: Pradeep Singh Yadav died while calling his wife  in phone

జమ్ము కశ్మీర్ :  జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతి చెందినవారిలో యూపీకి చెందినవారు 12మంది ఉన్నారు. వీరిలో జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ ఒకరు. ఈ దాడిలో మృతి చెందిన ఒక్కో సైనికుడిది ఒక్కో కథనం..అవి తలచుకుంటే మనస్సు ద్రవించిపోతుంది.  రాజస్థాన్‌కు చెందిన రోహితేశ్ లాంబా అనే జవాన్‌ కు పెళ్లి జరిగి ఒక్క సంవత్సరమే అయింది. అతనికి 2018 డిసెంబర్ లో ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపను కళ్లారా చూడకుండా ఉగ్రదాడికి బలైపోయాడు. ఇటువంటి కథలు ఎన్నో ఎన్నెన్నో. ఈ దాడిలో యూపీకి చెందిన సైనికుడు ప్రదీప్ సింగ్ యాదవ్ కథనం మరొకటి..


సరిగ్గా దాడి జరగటానికి ముందు ప్రదీప్ సింగ్ తన భార్యతో ఫోన్  మాట్లాడుతున్నాడు. అంతలోనే ఆత్మహూతి దాడి జరగడం..ప్రదీప్ సింగ్ మృతి చెందటం జరిగిపోయింది. ఏదో ప్రమాదం జరిగిందనీ భార్య నీరాజ్ కు అర్థమయ్యింది. భయపడిపోయింది..మనసుకు ఏదో కీడు శంకించడంతో ఏం జరిగిందో తెలుసుకోడానికి పదే పదే ఫోన్ చేసింది. కానీ ఫోన్ కలవలేదు. అల్లాడిపోయింది.  అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయిందని..ఇది ఊహించని ఘటన అని  ఆవేదన వ్యక్తం చేసింది. తనతో మాట్లాడుతోన్న సమయంలో ఉగ్రవాది తన వాహనంతో ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడిందనీ..బాంబు శబ్దాలు అవతలివైపు నుంచి వినపడటంతో ప్రమాదం జరిగినట్టు ఊహించానని..కానీ తన భర్త ప్రాణాలతో ఉండి ఉంటాడనే తన ఆశలను అడియాసలు చేస్తు కొంత సమయానికి భర్త చనిపోయాడని సీర్పీఎఫ్ కంట్రోల్ రూం నుంచి కాల్ చేసి చెప్పారని..భర్తతో అదే చివరిసారి మాట్లాడటం అవుతుందని ఊహించలేదని విలపిస్తోంది నీరాజ్ కనౌజ్ జిల్లా సుఖేసన్‌పూర్‌కు చెందిన ప్రదీప్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సుప్రియ (10), సోనా (2) అనే ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఆర్మీలోఉంటున్న క్రమంలో కల్యాణ్‌పుర సమీపం బరాసిరోహిలోని తన పుట్టింట్లో ఉంటోంది. భర్త రిటైర్ అయిన తరువాత అందరూ కలిసి ఆనందంగా ఉంటామని ఆశించాననీ..కానీ ఇప్పుడు తన ఇద్దరు బిడ్డలకు తండ్రి శాశ్వతంగా దూరమైపోయాడనీ..పిల్లల ఏడుపుని ఆపటం సాధ్యం కావటంలేదని నీరాజ్ వాపోయింది. 
 


Read Also: అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ

Read Also: ఆ ఘ‌ట‌న‌తోనే ఉగ్ర‌వాదిగా..సూసైడ్ బాంబ‌ర్ అదిల్ త‌ల్లిదండ్రులు


మరిన్ని వార్తలు