గుర్తుంచుకోండి : మార్చి 10న పల్స్ పోలియో

Submitted on 9 March 2019
Pulse polio program on March 10

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 10 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని 5 సంవత్సరాల లోపు ఉన్న 35 లక్షల 12 వేల 333 మంది పిల్లలందరికీ 22 వేల 768 పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేస్తారని పేర్కొంది.

ప్రయాణాల్లో ఉన్న వారి కోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కలు వేసే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోయిన చిన్నారుల కోసం హైదరాబాద్ లో రెండు రెజులపాటు, జిల్లాల్లో మూడు రోజులపాటు ఇంటింటి సర్వేక్షణ నిర్వహిస్తామని పేర్కొంది.

Pulse polio program
March 10
Telangana
Hyderabad

మరిన్ని వార్తలు