పబ్ జీ గేమ్ ఆడి...పిచ్చోడైపోయిన ఫిట్ నెస్ ట్రైయినర్

Submitted on 10 January 2019
PUBG' online game addiction lands fitness trainer in hospital, sixth case in Jammu

 ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు.

ఇప్పటికే అనేకమంది పబ్ జీ ఆడి మెంటల్ బాలెన్స్ కోల్పోయి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే కాశ్మీర్ లో కూడా రోజురోజుకీ పబ్ జీ కి బానిసలైపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. జమ్మూకాశ్మీర్ లో జిమ్ లో పనిచేసే ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ఇప్పుడు పబ్ జీ గేమ్ హాస్పిటల్ పాలయ్యాడు.
10 రోజుల నుంచి తిండి, నిద్ర లేకుండా ఫిట్ నెస్ ట్రైనర్ ఫోన్ లో అదేపనిగా పబ్ జీ ఆన్ లైన్ గేమ్ ఆడాడు.

గేమ్ లో మొదటి రౌండ్ పూర్తి అయ్యే సమయానికి గేమ్ కి బానిసైపోయిన అతడు తనను తాను హింసించుకోవడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. గేమ్ కి బానిసైన అతడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడని బాధితుడికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తెలిపారు. ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి అతడు వెళ్లిపోయాడని డాక్టర్ తెలిపారు. బాధితుడికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ఇలా పబ్ జీ గేమ్ ఆడి హాస్పిటల్ పాలైన వారిలో ఇది ఆరో కేసు అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.  పేరెంట్స్ తమ పిల్లలపై ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా గంటలపాటు ఒంటరిగా కూర్చొని మొబైల్స్ ని ఆపరేట్ చేస్తున్న సమయంలో వారిపై ఓ కన్నేసి ఉంచాలని డాక్టర్లు తెలిపారు.


 వెంటనే పబ్ జీ గేమ్ ని రాష్ట్రం, అదే విధంగా దేశంలో బ్యాన్ చేయాలని స్థానికులు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కోరారు. పబ్ జీ గేమ్ పై చైనా ఇప్పటికే తమ దేశంలో నిషేధించింది. దక్షిణ కొరియా వీడియో గేమ్ కంపెనీ బ్లూ హోల్ అనుబంధ కంపెనీ పబ్ జీ కార్పొరేషన్ ఈ ఆన్ లైన్ మల్టీప్లేయర్ గేమ్ ని డెవలప్ చేసింది.
 

PUBG
JAMMU KASHMIR
MEANTAL STAtus
lost
hitting himself
hospital

మరిన్ని వార్తలు