పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..

Submitted on 11 February 2019
PUBG competitor apex legends came inton market


ట్రెండ్‌  అంటే ఎప్పటికప్పుడూ మారుతూ ఉండటం.. అప్‌డేట్ అయిపోతూ ఉండటమే. కొత్తదనాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసే యూత్ కోసం.. మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అపెక్స్ లెజెండ్స్ పేరిట విడుదలైన ఈ గేమ్ విడుదలైన మూడు రోజుల్లోనే కోటిమంది దీనిని సబ్‌స్క్రైబ్ చేసుకున్నారట. అంటే ఒకేసారి దాదాపు 10లక్షల మంది లాగిన్ అవుతున్నారట. ఈ విషయాన్ని గేమ్‌ను రూపొందించిన రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ధ్రువీకరించింది. 

 

అమెరికాకు చెందిన వీడియో గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియో రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (ఈఏ)కు అనుబంధ సంస్థ. మంగళవారం ఫిబ్రవరి 5న లాంచ్ అయిన ఈ గేమ్...శుక్రవారం నాటికి లైవ్ స్ట్రీమింగ్ వీడియో ప్లాట్‌ఫామ్ అయిన ట్విచ్‌లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్‌గా నిలిచింది. అపెక్స్ గేమ్‌ను కేవలం XBOX, PS4, PCలలోనే ఆడుకునే వీలుంది. మొబైల్ వర్షన్ త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. 

 

ఇదే కంపెనీ నుంచి వచ్చిన గేమ్స్ అయిన బ్యాటిల్ ఫీల్డ్ వీ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దాంతో వార్షిక ఆదాయం చాలా తక్కువగా ఉండొచ్చని కంపెనీ భావించింది. ఇప్పటికే కంపెనీ షేర్లు 18 శాతం మేర పతనమైంది. కొన్ని రోజులకే అపెక్స్ లెజెండ్స్ గేమ్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం గమనార్హం. ఈ గేమ్ మొబైల్ వర్షన్ రాకుండానే ఇంతటి ఫేమ్ సంపాదించుకుందంటే త్వరలో ఈ గేమ్ మొబైల్ వర్షన్ వస్తే కచ్చితంగా పబ్‌జీను దాటేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

పబ్‌జీ గేమ్‌తో పాటు ఫోర్ట్ నైట్ అనే గేమ్స్‌కు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్‌సెంట్‌లో వాటా ఉంది. ఇవి ఉచితంగా అందుబాటులోకి రావడంతోనే ఎలక్ట్రానిక్ ఆర్ట్స్(ఈఏ) భారీ నష్టాల్లో కూరుకుపోయింది. 

Read Also : మీ ఐఫోన్ లో.. ఈ Apps ఉంటే మటాష్

Read Also : డిలీట్: ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో కొత్త ఫీచర్

Read Also:  జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

Read Also:  కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Read Also:  టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Read Also:  ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

PUBG
pubg game
pubg effect
PUBG Video Game

మరిన్ని వార్తలు