ఆదివాసీల ఆరాధ్యుడు : హైమన్ డార్ఫ్

Submitted on 11 January 2019
Professor Hymer Darf who survived for tribals In Adilabad district is Jainur Mandal Marlowe village

మార్లవాయి : ఆదివాసుల ఆరాధ్యుడు..గిరిజనుల జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన హైమన్ డార్ఫ్ జనవరి 11న ఆయన వర్థంతి. 1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో  జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. మట్టి మనుషులకు బాహ్యప్రపంచాన్ని..సంక్షేమాన్ని పరిచయం చేశాడు. గిరిజన అధ్యయనవేత్తగా ఎన్నో ప్రాంతాలు తిరిగారు.. ఎన్నో జాతుల్ని కలిశారు. ఈ క్రమంలో  ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులను..మార్లవాయి గ్రామాన్ని ఎంతగానో ఇష్టపడి..అక్కడే శాశ్వతంగా వుండిపోయారు. గిరిజనుల అభ్నున్నతికి ఎంతో కృషి చేయటంతో పాటు ప్రభుత్వాలకు గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు చేశారు. అందుకే ఈ ప్రాంతం ఆయన గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. 

స్వాతంత్య్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూ పంపిణీ
స్వాతంత్య్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగేలా చేసి వారి గుండెల్లో చెరగని ముద్రవేశారు.‘జంగల్‌-జమీన్‌' నినాదంతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటవీరుడు కొమురం భీం. అతను తెచ్చిన కదలికతో మేల్కొన్న నిజాం గోండు ప్రజల జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయమని నిజాం కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 'క్రిస్టఫర్‌ వాన్‌ ఫ్యూరర్‌ హైమన్‌ డార్ఫ్‌'ను నియమించాడు. నిజాం కాలంలో గిరిజనుల తిరుగుబాటుకు కారణాన్ని తెలుసుకొనేందుకు ప్రభుత్వం తరపున రాయబారిగా వచ్చి 1940లో ఆదిలాబాద్ లోని వచ్చి మార్లవాయి గ్రామంలో ఆదివాసులకు అండగా, వారి అభివృద్ధికి కావాల్సిన సహకారం కోసం నిజాం ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తు అక్కడే ఉండిపోయారు.

డార్ఫ్ కుమారుడు లచ్చు పటేల్: 
ఆదివాసీలతో ఆనుబంధానికి గుర్తుగా డార్ఫ్, బెట్టి ఎలిజిబెత్ దంపతులు వారి సంతానానికి గిరిజనుడి పేరు పెట్టుకొన్నారు. తమ కుమారుడికి లచ్చుపటేల్‌గా పేరు పెట్టుకున్నారు. 1990లో బెట్టి ఎలిజిబెత్ హైదరాబాద్‌లో కన్నుమూయగా, ఆమె కోరిక మేరకు మార్లావాయి గ్రామంలో గిరిజన సంప్రదాయంలోనే గిరిజనులంతా అంత్యక్రియలను జరిపించారు. సతీమణి మరణం అనంతరం డార్ఫ్ బంధువులు ఇంగ్లండ్ కు తీసుకెళ్లినా..ఆయన మనసంతా మార్లావాయిలోనే వుండేదట. అంతగా ఆ గిరిజులతో మమేకమైపోయారు డార్ఫ్. 
 1995లో డార్ఫ్ తుదిశ్వాస విడిచారు. ఆయన బ్రతికి వుండగానే భార్య ఎలిజిబెత్ సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకున్నారు. తాను మరణించిన తరువాత తన అస్థికలను మార్లవాయిలోని భార్య సమాధి పక్కనే వున్న తన సమాధిలో ఐక్యం చేయమని కుమారుడితో డార్ఫ్ చెప్పారట. ఈ క్రమంలో డార్ఫ్ చనిపోయిన 17 ఏళ్లకు 2012 ఫిబ్రవరి 27న డార్ఫ్ కుమారుడు లచ్చు కుమార్ అలియాస్ నికోలస్ తండ్రి డార్ఫ్ అస్థికలను మార్లవాయిలోని సమాధిలో గిరిజన సంప్రదాయంలో ఐక్యం చేశాడు. ఇలా ఇప్పటికీ డార్ఫ్  మార్లావాయి గిరిజనులు ఆయన తమ అభివృద్ధి కోసం అందించిన సేవలను ఇప్పటికీ స్మరించుకొంటున్నారు.

Adilabad
Jainur
Mandalam
Marlowi
tribals
Australia
Hyman Darf
wife
Elizabeth
Development

మరిన్ని వార్తలు