ఒక్క ఫొటోతో అగ్రస్థానంలో ప్రియాంక!

Submitted on 15 July 2019
Priyanka Chopra tops Hollywood Reporter’s Global Social Media Climbers chart; here’s the Instagram post that won her the crown

అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ హాలీవుడ్ రిపోర్టర్స్ విడుదల చేసే ‘గ్లోబల్‌ సోషల్ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌’లో మళ్లీ ప్రియాంక చోప్రా అగ్రస్థానానికి వచ్చేసింది. దీంతో వరుసగా గత నాలుగు వారాల్లో మూడుసార్లు టాప్‌ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ మొత్తం 12 సార్లు ఈ జాబితాలో ప్రియాంక అగ్రస్థానంలో ఉండటం విశేషం.
Also Read : మా భవిష్యత్తు ఇస్మార్ట్ శంకర్ తోనే!

గతవారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంక.. ‘ది రాక్‌’ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తుంది.

వరుస బాలీవుడ్,హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న ‘గ్లోబల్‌స్టార్‌’ ప్రియాంక...సోషల్‌మీడియా వేదికగానూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌ లో ఉంటుంది. కాగా ప్రియాంక స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రియంక భర్త నిక్‌ జోనస్ ఈ ఫొటోలను తీయగా, దాదాపు 30లక్షలమంది ఈ ఫొటోను లైక్‌ చేశారు.
Also Read : ఎదిగేకొద్ది ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటా : ర‌ష్మిక‌

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Best use of a vacation. The hubby taking pictures. Lol 😝 📷@nickjonas 👙 ☀️ 🍸 💏

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

Priyanka Chopra
JONAS
INSTAGRAM POST
CROWN
GLOBAL SOCIAL MEDIA CLIMBERS CHART
HOLLYWOOD REPORTERS

మరిన్ని వార్తలు