‘ఫ్రోజెన్ 2’ కోసం కలిసిన చోప్రా సిస్టర్స్

Submitted on 19 October 2019
Priyanka Chopra Jonas and Parineeti Chopra do voice over for the Hindi version of Frozen 2

బాలీవుడ్ బ్యూటీస్.. చోప్రా సిస్టర్స్.. ప్రియాంక చోప్రా జోనాస్, పరిణీతి చోప్రా కలిసి ఫస్ట్ టైమ్ ఓ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.. వీరిద్దరూ కలిసి నటించడం లేదు కానీ.. ఓ హాలీవుడ్ సినిమా హిందీ వెర్షన్ కోసం చోప్రా సిస్టర్స్ ఇద్దరూ తమ వాయిస్ ఇస్తున్నారు.

2013లో వచ్చిన పాపులర్ యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా.. దాదాపు అదే టీమ్‌తో డిస్నీ సంస్థ ‘ఫ్రోజెన్ 2’.. నిర్మించింది. క్రిస్ బక్ అండ్ జెన్నిఫర్ లీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ‘ఇదియా మెజెల్’ పోషించిన ‘ఎల్సా’ క్యారెక్టర్‌కు ప్రియాంక చోప్రా వాయిస్ ఇచ్చింది.

Read Also : తల అజిత్ 60 - ‘వాలిమై’ ప్రారంభం

‘క్రిస్టెన్ బెల్’ చేసిన ‘అన్నా’ క్యారెక్టర్‌కు పరిణీతి చోప్రా హిందీలో డబ్బింగ్ చెప్పింది. ‘ఫ్రోజెన్ 2’ నవంబర్ 22న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

 

Frozen 2
Priyanka Chopra Jonas
Parineeti Chopra
Walt Disney Pictures
Chris Buck Jennifer Lee

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు