ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే చంద్రబాబు, బాలకృష్ణ ఎలా గెలిచారు

Submitted on 25 May 2019
prithvi, krishnudu questions chandrababu, balakrishna

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని సినీ నటులు, వైసీపీ నాయకులు పృథ్వీ రాజ్, కృష్ణుడు అన్నారు. ప్రజా సమస్యలపై జగన్ కు పూర్తి అవగాహన ఉందని వారు అన్నారు. కుల, మతాలకు అతీతంగా జగన్ పాలన అందిస్తారు అని వారు చెప్పారు. చంద్రబాబు ద్వంద్వ విధానాలతోనే టీడీపీ ఓటమి పాలైందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే తాము ఓడిపోయామని కొందరు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పృథ్వీ, కృష్ణుడు ఖండించారు. అదే నిజమైతే చంద్రబాబు, బాలకృష్ణ ఎలా గెలిచారని వారు ప్రశ్నించారు. 

సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు విన్న ఏకైక నాయకుడు పృథ్వీ అన్నారు. వారికి తాను అండగా ఉంటానని భరోసారి ఇచ్చారని చెప్పారు. జగన్ మాటలను, హామీలను విశ్వసించిన ప్రజలు.. వైసీపీకి పట్టం కట్టారని పృథ్వీ చెప్పారు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చంద్రబాబుకి.. 23మంది మాత్రమే మిగిలారని విమర్శించారు. ప్రజాసంకల్ప యాత్ర రోజే జగన్ విజయం సాధించారని పృథ్వీ చెప్పారు. జగన్ తో తాము ఏడు సార్లు పాదయాత్రలో పాల్గొన్నామని, జగన్ గెలుపు ఖాయం అని అప్పుడే చెప్పామని పృథ్వీ అన్నారు. వైసీపీ గెలుపు ప్రజలు, మహిళలు, రైతులు, బడుగుబలహీన వర్గాల విజయం అని అన్నారు. ప్రజలు సంక్షేమ రాజ్యం కోరుకున్నారని చెప్పారు.

prithvi
krishnudu
Ysrcp
evm tampering
tdp defeat
Ys Jagan

మరిన్ని వార్తలు