మార్కెటింగ్ గాడ్ ఫాదర్ : ప్రధాని మోడీకి ‘ఫిలిప్ కోట్లర్’ అవార్డు 

Submitted on 16 January 2019

మార్కెంటింగ్ గాడ్ ఫాదర్ ఫిలిప్ కోట్లర్
అవార్డ్ ను ప్రవేశపెట్టిన తొలిసారే ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ అవార్డ్ 
జనవరి 14న ప్రధానికి ‘ఫిలిప్ కోట్లర్’ అవార్డు ప్రదానం


ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. మోడ్రన్‌ మార్కెటింగ్‌ పితామహుడిగా గుర్తింపు పొందిన ఫిలిప్‌ కోట్లర్‌ పేరుతో ఇచ్చే  ఫిలిప్‌ కోట్లర్‌’ అవార్డును మోడీ అందుకున్నారు.  ‘ఫిలిప్‌ కోట్లర్‌’  అవార్డ్ ను ప్రవేశపెట్టిన తొలిసారే ప్రధాని మోడీ అందుకోవడం విశేషం. ‘ప్రజలు, లాభం, భూమి’ అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఈ అవార్డు అందిస్తున్న క్రమంలో దేశ ప్రధానిగా విశిష్ట నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నందుకుగాను మోడీకి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అవార్డు కమిటీ తెలిపింది. కోట్లర్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలోని కల్లోజ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో మార్కెటింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా కోట్లర్ పనిచేస్తున్నారు. నరేంద్రమోదీ దేశానికి చేస్తున్న నిస్వార్థ సేవ, అవిశ్రాంత కృషి వల్ల ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్‌ అభివృద్ధి సాధించింది’ అని కమిటీ తెలిపింది. 

ఈ క్రమంలో మోడీకి అవార్డ్ ప్రదానం చేసేందుకు అనారోగ్యం కారణంగా కోట్లర్‌ ఢిల్లీకి రాలేకపోయారు. ఆయన తరఫున జార్జియాలోని ఈఎంఓఆర్‌వై వర్సిటీ ప్రొఫెసర్‌ జగదీశ్‌ సేత్, కమిటీ ప్రతినిధులు సోమవారం (జనవరి 14) ప్రధాని మోడీకి ‘ఫిలిప్ కోట్లర్’ అవార్డు అందజేశారు. మోడీని స్వయంగా కలవలేకపోయినందుకు చింతిస్తున్నట్లు ఫిలిప్ తెలిపారు. ఈ మేరకు ప్రొఫెసర్ జగదీశ సేత్‌కు ఇ-మెయిల్ చేశారు. ‘ప్రధాని మోడీకి ఫిలిప్ కోట్లర్ అవార్డు ప్రదానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ క్రమంలో మీరు పోషించిన పాత్రపై ఎంత పొగిడినా తక్కువే. మోడీని స్వయంగా కలవలేకపోయినందుకు బాధపడుతున్నా.’ అని ఫిలిప్ కోట్లర్ పేర్కొన్నారు.

రష్యా నుండి అమెరికా వెళ్లి చికాగోలో స్థిరపడిన బెట్టీ, మరిస్ లకు కోట్లర్  27, 1931న చికాగోలో జన్మించారు. మార్కెంటింగ్ కు సంబంధించి కోట్లర్ 60కి పైగా పుస్తకాలు రాశారు. డిపౌల్ యూనివర్శిటీలో పాటు మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి అంశాలపై డిగ్రీ చేసి..మాసచుసెట్స్ ఇన్ట్సిట్యట్ ఆఫ్ టెక్నాలజీలో 1956లో ఎకనమిక్స్ లో పీహెచ్ డీ చేశారు. 1962లో కోట్లర్ నార్త్ వెస్ట్రన్ యూనివర్శటీలో కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మార్కెటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1975 లో కోట్లర్ "మార్కెటింగ్ థాట్ లీడర్" అవార్డును అందుకున్న తొలి వ్యక్తి కోట్లర్. 

Delhi
Prime Minister
Narendra Modi
Philip Kotler
Award
Northworth
University
Callous
School of Management
Marketing
Professor

మరిన్ని వార్తలు