అమల్లోకి ఈబీసీ బిల్లు: సంతకం చేసిన రాష్ట్రపతి

Submitted on 12 January 2019
President Ram Nath Kovind signs reservation bill

ఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రెండురోజులక్రితం పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది.  బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో బిల్లు అమల్లోకి వచ్చింది.ఇక నుంచి ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ లభించనుంది.

EBC Bill
President
Ram Nath Kovind
10 percent reservation

మరిన్ని వార్తలు