పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్

Submitted on 23 January 2020
Presenting the First Look of Uppena

మరో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

Image result for ఉప్పెన సినిమా

ఇంతకుముందు ప్రీ లుక్‌లో మత్స్య కారుడి గెటప్‌లో మాస్‌గా కనిపించిన వైష్ణవ్ తేజ్ ఈ లుక్‌లో మోడ్రన్‌‌గా కనిపించాడు. కృతి శెట్టి కథానాయికగా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అవుతుంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు.

Read Also : తేజతో రానా ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి తేజ్ తదితరులు ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వైష్ణవ్ తేజ్‌కి విషెష్ తెలిపారు. కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి. 
 

Panja Vaisshnav Tej
Krithi Shetty
Devi Sri Prasad
Mythri Movie Makers
BuchiBabu Sana
Uppena On April 2nd

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు