టీమిండియా విక్టరీపై రాంగ్ ట్వీట్: ప్రీతిజింటాపై ట్రోల్స్ 

Submitted on 8 January 2019
Preity Zinta Trolled For Error In Congratulatory Tweet Post India's Historic Win In Australia

71ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ను సాధించిన ఏషియన్ టీమ్ గా టీమిండియా రికార్డు సృష్టించింది. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ ల్లో 2-1 తో సిరీస్ ను దక్కించుకున్న కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు సాధించిన విక్టరీపై సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి, ఐపీఎల్ కింగ్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా కూడా టీమిండియాపై తన ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాలనుకుంది. ఆ తొందరలో ప్రీతి తప్పులో కాలేసింది. ‘‘టీమిండియాకు అభినందనలు. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు (మ్యాచ్) ను గెలిచిన ఏషియన్ టీమ్ గా రికార్డు నెలకొల్పారు’’ అని ఆమె రాంగ్ ట్వీట్ చేసింది.

అంతే క్షణాల్లో వైరల్ అయిన ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ప్రీతి మేడమ్.. టెస్టు మ్యాచ్ కాదు.. టెస్టు సిరీస్.. కరెక్ట్ చేయండి అని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. నిజానికి ఆస్ట్రేలియాలో తొలి టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు అభినందనలు అని ప్రీతి ట్వీట్ ఉద్దేశం. పొరపాటున ప్రీతి మ్యాచ్ అని రాంగ్ ట్వీట్ చేయడంతో ట్రోల్స్ పేలాయి. మరో నెటిజన్ ప్రీతిపై ఘాటుగా స్పందించాడు. హాఫ్ నాల్డ్రేజ్ వెరీ డేంజరస్.. టెస్టు మ్యాచ్ గెలిచిన టీమ్ కాదు మేడం.. తొలి టెస్టు సిరీస్ గెలిచిన టీమ్.. గతంలో కూడా టీమిండియా ఎన్నో టెస్టు మ్యాచ్ లు గెలిచిందని ట్రోల్ చేశాడు. 

Preity Zinta
Twitter Trolls
Team India
Australia 

మరిన్ని వార్తలు