గర్భిణీ అని చూడలేదు..భార్య హత్యకు సుపారీ

Submitted on 17 January 2020
pregnant wife's murder man in extramarital affair with sister-in-law

దేశంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కనికరం లేకుండా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా కొన్ని ఘటనలు అక్రమ సంబంధాల వల్ల చోటు చేసుకుంటున్నాయి. తమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో దారుణంగా చంపేస్తున్నారు. తమ వారిని చంపేందుకు సుపారీ కూడా ఇస్తున్నారు. తాజాగా గర్భవతియైన భార్యను దుండగులతో చంపించిన ఘటన ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. భార్య సోదరితో అక్రమ సంబంధం ఉందని, ఆమెను అడ్డు తొలగించుకొనేందుకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు నిందితుడు వెల్లడించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


మీవాటి చౌక్‌లోని బెహ్తా హజీపూర్ ఆసీఫ్..తన భార్యతో నివాసం ఉంటున్నాడు. వీరికి నమీరా (7), ఆతీఫ్ (12) సంతానం ఉన్నారు. ఆసీఫ్, ఇతని భార్య హత్యకు గురైంది. జనవరి 12వ తేదీన ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి భర్తను అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. తన భార్య సోదరితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని, అడ్డుగా ఉన్న భార్యను అడ్డు తొలగించుకోవడానికి నిందితుడు ప్లాన్ వేసినట్లు తెలిపారు.

ఆసీఫ్‌ను విచారించగా పలు విషయాలు వెల్లడించాడన్నారు. గర్భిణీగా ఉన్న తన భార్య సోదరితో అక్రమ సంబంధం ఉందని, తనకు విషం ఇచ్చి హత్య చేయాలని రవీందర్, సందీప్ దుండగులకు రూ. 30 వేలు సుపారీ ఇచ్చినట్లు తెలిపాడన్నారు. అయితే..విషం ఇవ్వడంలో రెండుసార్లు ఫెయిల అయినట్లు, దొంగతనం నెపంలో ఇంటికి వెళ్లి..భార్య గొంతు కోసి చంపారని నిందితుడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. తన పిల్లలను తన భార్య సోదరి వద్ద ఉంచాలని కోరినట్లు తెలిపారు. విచారణలో 100 సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించినట్లు, చంపాడనికి ముగ్గురు నిందితులను ఉపయోగించినట్లు తేలిందన్నారు. ఆసీఫ్‌ను అరెస్టు చేసినట్లు, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

Read More : Vodafone న్యూ ప్లాన్స్

pregnant wife
extramarital
affair
SISTER IN LAW
Ghaziabad
Mewati Chowk
Behta Hazipur.

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు