క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడిక్ డ్రామా

Submitted on 21 January 2020
Power star Pawan Kalyan's next confirmed to be in National Award Winner Krish

చిన్న విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు.. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే పవన్ తన తర్వాతి సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడు. పవన్ 27వ చిత్రానికి జాతీయ అవార్డునందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనున్నారు.

Read Also : నన్ను రేప్ చేశారు.. రాహుల్ షాకింగ్ పోస్ట్

ప్రముఖ నిర్మాత, శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల తర్వాత పవన్, ఎ.ఎం.రత్నం కలయికలో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందనున్న పవన్ 27 జనవరి 27న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
 

Pawan kalyan
PSPK 27
A M Ratnam
Krish

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు