బాషా పండితుల కల సాకారం : పోస్టులు అప్ గ్రేడ్ చేసిన  ప్రభుత్వం

Submitted on 17 February 2019
Posts Up Grade by Government

హైదరాబాద్ : పాఠశాల  విద్యాశాఖ పరిధిలోని ప్రాధమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 6వేల 143 భాషా పండిట్ పోస్టులును స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లుగా,802 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా అప్ గ్రేడ్ చేశారు.  ఈ మేరకు పే స్కేళ్ళను ఆర్ధిక శాఖ నిర్దారించింది. భాషా పండితులు, పీఈటీ  పోస్టులను అప్ గ్రేడ్ చేయటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.  

school
SGT
Pandit
PET
Telangana
Education

మరిన్ని వార్తలు