స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వాయిదా

Submitted on 24 May 2019
Postpone elections Telangana local organizations

తెలంగాణలో ఈనెల 27న వెలువడాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వాయిదా పడ్డాయి. జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ ఎన్నికకు 40 రోజుల తేడా ఉండటంతో..విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై ఇప్పటికే విపక్షాలు.. ఎన్నికల సంఘం అధికారులను కలిసి కౌంటింగ్‌ వాయిదా వేయాలని కోరాయి కూడా. విపక్షాల కోరిక మేరకు కౌంటింగ్‌ వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. లెక్కింపు తేదీని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

కొత్తగా ఎన్నికయ్యే MPTC, ZPTC పదవీకాలం జులై 3 నుంచి ప్రారంభం కానుంది. వాళ్లు ఎన్నికయినా..ప్రమాణ స్వీకారం చేయడానికి మరో నెల రోజుల పాటు ఆగాల్సి ఉంటుందని..ఈ మేరకు కౌంటింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 
538 జడ్పీటీసీ స్థానాలకు, 5వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 
 

Postpone
Elections
Telangana
local organizations

మరిన్ని వార్తలు