సోషల్ మీడియాతో పోసాని : నేను బతికి ఉన్నాను రా..

Submitted on 13 July 2019
Posani Krishna Murali Health News viral

హైదరాబాద్ : విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు,నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యంపై శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.

పోసాని పరిస్థితి విషమం అంటూ ప్రచారం
పోసాని కృష్ణమురళికి రోగం తిరగబడింది.. మొన్న చేయించుకున్న ఆపరేషన్ వికటించి.. మళ్లీ సర్జరీ చేశారు.. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాట్సాప్ గ్రూపుల్లోకి చేరిపోయింది. ముందూ వెనకా ఆలోచించకుండా దాన్ని వైరల్ చేసేశారు నెటిజన్లు. ఈ విషయం తెలిసిన పోసాని ఫ్యాన్స్ కొంచెం ఆందోళనకు గురయ్యారు. ఆయన అభిమానులు, కొందరు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో నేరుగా పోసాని కృష్ణమురళీకి ఫోన్ చేశారు. అసలు నిజం అప్పుడు తెలిసింది.

నేను బతికే ఉన్నాను రా..

దీనిపై పోసాని స్పందించారు. నేను క్షేమంగా ఉన్నానని.. బతికే ఉన్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి వైద్యం తర్వాత ఇంటికి కూడా తిరిగి వచ్చినట్లు వెల్లడించారాయన. జూలై 19 నుంచి షూటింగ్ లో కూడా పాల్గొననున్నట్లు వెల్లడించారు.  ప్రస్తుతం మహేష్ బాబు - అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు పోసాని. సో త్వరలో పోసాని షూటింగ్ ల్లో బిజీగా ఉండబోతున్నారు. 
Also Read : పాపం పండింది : బాలకృష్ణ మాజీ పీఏకు జైలు శిక్ష‌

Cinema
Posani Krishna Murali
Viral post
Health

మరిన్ని వార్తలు