TV9 కార్యాలయంలో రవిప్రకాశ్ ను విచారిస్తున్న పోలీసులు

Submitted on 9 May 2019
Police investigating Ravi Prakash in TV9 Office

TV9 కార్యాలయంలో రవిప్రకాశ్ ను పోలీసులు విచారిస్తున్నారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన్న విచారిస్తున్నారు. రవిప్రకాశ్ తోపాటు శివాజీ, మూర్తిలకు నోటీసులు అందజేశారు. శుక్రవారం (మే 10, 2019) ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు అందజేశారు. 
అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. TV9 ఆర్థిక వ్యహారాలు చూసిన మూర్తిని కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈమేరకు ఆ ముగ్గురు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. 

రవి ప్రకాశ్ పై వచ్చిన ఫిర్యాదు, తీసుకున్నచర్యలు, ఉదయం నుంచి చేపట్టిన కార్యాకలాపాలకు సంబంధించి పోలీసులు ఒక ప్రెస్ నోట్ రీలిజ్ చేశారు. TV9 కార్యాలయం, రవి ప్రకాశ్, శివాజీ, మూర్తి ఇళ్లల్లో సోదాలు నిర్వహించామని ప్రెస్ నోట్ లో వెల్లడించారు. 

బంజారా హిల్స్ లోని అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బంజారాహిల్స్ లోని వి.రవిప్రకాష్ నివాసం, హిమాయత్ నగర్ లోని శివాజీ నివాసం, ఖైరతాబాద్ లోని ఎంవీకెఎన్ మూర్తి నివాసంతోపాటు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 

Police
investigating
Ravi Prakash
TV9 Office
Hyderabad

మరిన్ని వార్తలు