పోలీసు కారులో ఫైర్.. దూకేసిన పోలీసులు

Submitted on 18 January 2019
Police Car Mysteriously Bursts Into Flames On Busy Road

ఆ రోడ్డుంతా వాహనాల రద్దీతో బిజీగా ఉంది. అందులోనూ అర్ధరాత్రి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా బీఎండబ్ల్యూ 5 సిరీస్ పెట్రోల్ కారును పోలీసులు రోడ్డుపై నిలిపారు. ఇంతలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు దగ్ధమైంది. మరో వాహనం వచ్చి ఢీకొట్టలేదు. ఏమైందో తెలియలేదు. నిలిపిన పోలీసు కారులో నుంచి మంటలు వ్యాపించడంతో పోలీసులు షాక్ అయ్యారు. అదృష్టవశాత్తూ కారులో పోలీసులకు ప్రాణపాయం తప్పింది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ పెట్రోల్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆగ్నేయ లండన్ లోని బ్రోములీ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ముందుగా బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో వాహనానికి మంటలు అంటుకున్నట్టు పోలీసులు తెలిపారు. కారులో మంటలు చెలరేగడంతో అందులోని పోలీసులు వెంటనే బయటకు దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బ్రుమూలీ పోలీసులు ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఫాక్స్ న్యూస్ ప్రకారం.. కారులో మెకానికల్ ప్రాబ్లమ్ కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. 

Police Car
Mysteriously Burst
Busy Road

మరిన్ని వార్తలు