విశాఖలో నకిలీ డాక్టర్ కేసు : అమ్మాయిల నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

Submitted on 17 November 2019
police arrest fake doctor

విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కనుగొన్నారు. వాటిని అడ్డుపెట్టుకుని యువతుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు వంకా కుమార్. ఈ నేరాలు చేయడంలో కుమార్ కు అతడి స్నేహితులు సహకరించారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వంకా కుమార్ అమాయక యువతులని టార్గెట్ చేసుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ.. ఎంతోమందిని మోసం చేశాడు. ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తూ డబ్బు, బంగారం వసూలు చేశాడు. చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో కుమార్ పాపం పండింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.. దర్యాప్తులో అతడు చెబుతున్న విషయాలతో పోలీసులే షాక్ అవుతున్నారు.

విశాఖ కంచరపాలెంకు చెందిన వంకా కుమార్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన కుమార్ సోషల్ మీడియాలో అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మరికొందరు స్నేహితులతో కలిసి.. ముఠాగా ఏర్పడ్డాడు. ఫేస్‌బుక్‌‌లో ఫేక్ అకౌంట్ తెరిచిన కుమార్.. తప్పుడు వివరాలతో తనను డాక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. అమాయకులైన అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. అతడి మాయ మాటలు నమ్మిన చాలామంది యువతులు అతడిని కలిశారు.

కుమార్ అలా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసేవాడు. ఈ వీడియోలు చూపి బెదిరించి.. వారి దగ్గర నుంచి డబ్బు, బంగారం లాగాడు. ఇలా అతడి ట్రాప్‌లో చాలామంది యువతులు పడ్డారు. అయితే పరువు పోతుందని ఎవరూ బయటపెట్టలేదు. కానీ ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కుమార్ ని అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్ మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతులను పోలీసులు హెచ్చరించారు. ఎవరిని పడితే వారి గుడ్డిగా నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. వారు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేదానిపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు.

Police
Arrest
fake doctor
Visakha
trap
girls
vanka kumar
cheating

మరిన్ని వార్తలు