ముంబై కోర్టు బయట PMC బ్యాంక్ డిపాజిటర్ల ఆందోళన

Submitted on 9 October 2019
PMC Bank depositors protested in front of Esplanade court today. Protesters were holding placards demanding no bail for the accused

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(PMC బ్యాంక్)క‌స్ట‌మ‌ర్లు ఇవాళ ముంబై వీధుల్లో ఆందోళ‌న చేప‌ట్టారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌స్ట‌మ‌ర్లు ఆరోపిస్తున్నారు. రిజ‌ర్వ్ బ్యాంక్ అల‌స‌త్వాన్ని ప్ర‌శ్నించారు. పీఎంసీ బ్యాంకులో సుమారు 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింది. పీఎంసీ బ్యాంకు డైర‌క్ట‌ర్ల‌ను ఇటీవ‌ల ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ‌వారికి బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని, వారిని జైలుకు పంపాల‌ని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఎస్‌ప్ల‌నేడ్ కోర్టు ముందు భారీ ప్ల‌కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు కోర్టు ప్రాంగ‌ణంలో వాహ‌నాల‌పై దాడికి దిగారు. విత్‌ డ్రాల‌పై ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్ట‌డాన్ని పీఎంసీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాము బ్యాంకులో దాచుకున్న డ‌బ్బును త‌క్ష‌ణ‌మే రిలీజ్ చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

protesters
bail
ACCUSED
PMC Bank
DEPOSITERS
Protest
ESPLANADE COURT

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు