తెగ స్పీచ్‌లు ఇస్తారు : మోడీ.. ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు!

Submitted on 11 January 2019
PM Narendra Modi cannot speak proper English, says Mamata Banerjee

న్యూఢిల్లీ: ప్రసంగాలు దంచికొట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ముందుంటారు. స్పీచ్ లు ఇవ్వడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరనే చెప్పాలి. హిందీలో మోడీ అనర్గళంగా ప్రసంగాలను ఇచ్చేస్తుంటారు. కానీ.. ఇంగ్లీష్ లో కాదు. ఈ మాట అన్నది ఎవరో కాదు.. దీదీ.. అదేనండీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఓ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఇంగ్లీష్ వ్యాఖ్యలను సరిగా పలకలేరని కామెంట్ చేశారు. 

మోడీ ఎప్పుడూ ఆంగ్లంలో మాట్లాడినా.. టెలిప్రాంప్టర్ల వైపు చూస్తుంటారని ఆమె చురకలు అంటించారు. ‘‘మోడీ గారు.. ఎన్నో ప్రసంగాలు ఇస్తుంటారు. కానీ, ఇంగ్లీష్ లో మాత్రం సరిగా మాట్లాడలేరు. అందుకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు టెలిప్రాంప్టర్ల వైపే చూస్తుంటారు’’ అని బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యానించారు. ఈ విషయం మీడియాతో సహా అందరికి తెలిసిన విషయమే అన్నారు. ఇంగ్లీష్ భాషలో తనకు ఏదో ప్రావీణ్యం ఉందనే తరహాలో స్ర్కీన్  వైపు చూస్తూ ఆ ప్రసంగాన్ని మోడీ చదువుతూ కనిపిస్తారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.  

Narendra Modi
PM
English
Mamata Banerjee
 

మరిన్ని వార్తలు