అద్వానీ, జోషి ఆశీర్వాదం తీసుకున్న మోడీ, షా

Submitted on 24 May 2019
PM Narendra Modi, Amit Shah meet Advani, Murli Manohar Joshi

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆఖండ విజయం సాధించింది. బీజేపీ ఒంటరిగానే 300కిపైగా స్థానాల్లో గెలిచింది. ఎన్డీయే పక్షాలతో కలిసి 350కిపైగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. నరేంద్ర మోడీ మేనియా బీజేపీని గెలిపించింది. తిరుగులేని విజయం దక్కడంతో బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు నరేంద్ర మోడీ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిశారు. ఇద్దరూ.. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అద్వానీ, జోషి లాంటి నాయకుల పోరాటాల వల్లే బీజేపీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందని మోడీ అన్నారు. బీజేపీ విజయాన్ని మోడీ, షా.. సీనియర్ నేతలకు వివరించారు. పార్టీ నిర్మాణానికి అద్వానీ దశాబ్దాలుగా కృషి చేశారని మోడీ చెప్పారు. అద్వానీని కలిశాక మోడీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

మురళీ మనోహర్ జోషి మేథావి అని మోడీ కితాబిచ్చారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు జోషి నిత్యం కృషి చేశారని చెప్పారు. తన లాంటి ఎందరో కార్యకర్తలకు జోషి.. మెంటర్ గా వ్యవహరించారని, వారికి మార్గదర్శనం చేశారని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ముందు కాంగ్రెస్ వ్యూహలు ఫలించలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. లోక్ సభలో తన బలాన్ని మరింత పెంచుకుంది. గతంకంటే ఘనమైన విజయం సాధించింది. మోడీ, షా ప్రయాణంలో ఈ విజయం మరో మైలురాయి.

PM Narendra Modi
Amit Shah
advani
Murli Manohar Joshi
BJP
NDA
massive victory

మరిన్ని వార్తలు