నెల రోజులు కాశీలో అడుగుపెట్టవద్దని ఆదేశించారు

Submitted on 27 May 2019
PM Narendra Modi addressing BJP workers in Varanasi

వారణాశి పర్యటనలో భాగంగా ఇవాళ(మే-27,2019)ఉదయం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. పూజలు నిర్వహించిన అనతంరం బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మోడీ మాట్లాడుతూ...నేను వారణాశి కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది.ఓ నెల రోజులపాటు వారణాశిలో అడుగుపెట్టవద్దని మీరందరూ నన్ను ఆదేశించారు.దేశం నన్ను ప్రధానిగా ఎన్నుకుని ఉండవచ్చు కానీ మీకు మాత్రం నేను వర్కర్ నే.మీ ఆదేశాలే నాకు ముఖ్యం.ప్రచారం తర్వాత వారణాశి రావాలని అనుకున్న ప్రతిసారీ మీ ఆదేశాలు గుర్తుకొచ్చి ఆగిపోయాను.

ఎన్నికల సమయంలో,ఫలితాల సమయంలో ఓ అభ్యర్థిగా నాలాగా చాలా రిలాక్స్ గా ఉండటం చాలా అరుదు.మీ హార్డ్ వర్క్ దానికి కారణం.నేను చాలా రిలాక్స్ గా ఉండబట్టే కేధార్ నాథ్ వెళ్లాను.కాశీలోని మద్దతుదారులు గెలుపోటముల కొలతలపై ఎన్నికల బరువు పెట్టలేదు.వాళ్లు ఇది ఓ లోక్ శిక్ష,లోక్ సంపర్క్,లోక్ సంగ్రహ్,లోక్ సంర్గన్ ఫెస్టివల్ గా పరిగణించారని మోడీ అన్నారు.

Modi
varanasi
ordered
WORKERS
foot
one month
RECALL
kedharnath
relaxed
campaign

మరిన్ని వార్తలు