హిందువులంటే భయపడే వాళ్లే ఇండియాని చెడగొడతున్నారు-మోడీ

Submitted on 11 September 2019
PM Modi says Hindu phobics ruining India; Congress says PM speaking like pope, Left too slams

హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్‌ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకతతో పాటు విమర్శలు వస్తున్నాయి. 

ప్రసంగంలో మోడీ తెలిపిన మాటలు ఇలా ఉన్నాయి. 'ఈ దేశం దౌర్భాగ్యం ఏమిటంటే.. ఓమ్, ఆవు ఈ మాటలు విన్న కొందరికీ వెంట్రుకలు నిక్క బొడుచుకుంటున్నాయి. దేశం ఇంకా 16వ శతాబ్దంలో ఉందని వారు అనుకుంటున్నారు. ఇలాంటి తెలివితో ఉన్న వారు తాము చేయాలనుకుందంతా చేస్తున్నారు' అని వ్యాఖ్యలు చేశారు. 

మోడీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ప్రధాని ఓ మతగురువులా మాట్లాడుతున్నారు. ముందు మోడీ దేశంలో జీడీపీ వృద్ధి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విమర్శలకు తావిచ్చేలా మోడీ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని లెఫ్టిస్టులు పేర్కొన్నారు. 

pm modi
HINDU
phobics
india
Congress
PM
pope
Modi

మరిన్ని వార్తలు