రోడ్లపై జనాలను చూసి ర్యాలీ ఖాళీ అనుకున్నా

Submitted on 13 April 2019
PM Modi in Mangaluru: I thought if so many people are here,who will be there

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-13,2019)మంగళూరులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీకి పెద్దఎత్తున హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ....నేను ఎయిర్‌ పోర్ట్ నుంచి ఇక్కడికి చాలాదూరం జర్నీ చేసి వచ్చాను. రోడ్డుకు రెండువైపులా ఎక్కడ చూసినా జనమే.

నేను చూసింది మానవహారం కాదు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మానవగోడ.అప్పుడు నేను ఒకటే అనుకున్నాను. జనమంతా ఇక్కడే ఉన్నారు. మరి అక్కడ (సభా స్థలి) ఎవరు ఉంటారనిపించింది. అయితే, బయట ఎంత మంది ఉన్నారో ఇక్కడ కూడా అంతే సంఖ్యలో జనం హాజరయ్యారు అని మోడీ అన్నారు.మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ర్యాలీకి హాజరైన కొందమంది అక్కడున్న చెట్లపైకి ఎక్కి చేతులు ఊపడం ప్రారంభించారు.దీన్ని గమనించిన మోడీ...చెట్లు ఎక్కినవారు కిందికి దిగిరావాలని కోరారు.

Modi
Rally
MANGULURU
loksabha elections
people
climb
down
human wall
karnataka

మరిన్ని వార్తలు