వ్యవసాయరంగం కోసం హై లెవల్ టాస్క్ ఫోర్స్..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్

Submitted on 15 June 2019
PM has announced a high-level task force to bring structural reforms in agriculture in the country

శనివారం(జూన్-15,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 5వ పాలకమండలి సమావేశం జరిగింది.సమావేశం తర్వాత నీతా ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మీడియాతో మాట్లాడారు.స్టేట్ డిజాస్టర్ రెస్ఫాన్స్ ఫండ్ కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రప్రభుత్వం రివ్యూ చేయాలని రాష్ట్రాల సీఎంలు సమావేశంలో కోరినట్లు అమితాబ్ తెలిపారు.హోం వ్యవహారాలు,వ్యవసాయ మంత్రిత్వ శాఖల సహకారంతో కేంద్రం దీనిపై పనిచేస్తుందని తెలిపారు.

అటవీ చట్టంలో కొన్ని మార్పులు చెయ్యాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు.మధ్యప్రదేశ్,గోవా సహా పలు రాష్ట్రాల సీఎంలు మైనింగ్ రంగంలో ఉత్పత్తి క్షీణిస్తున్నదని తెలిపారన్నారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ...దేశంలోని వ్యవసాయరంగంలో నిర్మాణ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ని ప్రకటించాడు.త్వరలోనే ఇది ఫార్మ్ అవుతుంది.మరో రెండు మూడు నెలల్లో రిపోర్ట్ అందిస్తుందన్నారు.ముగ్గురు సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేకపోయారన్నారు.వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్,తెలంగాణ సీఎం కేసీఆర్ లు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు.

PM
announced
a high-level task force
bring
structural reforms
agriculture
country
NITI AYOG
CEO
vice chairman
amitab kanth
Rajiv Kumar

మరిన్ని వార్తలు