ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారత్

Submitted on 15 June 2019
  PM at the 5th meeting of Governing Council of NITI Aayog: Goal to make India a 5 trillion dollar economy by 2024

2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా దేశాన్ని మార్చడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు.ఈ లక్ష్య సాధనకు రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు.భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం సవాలే అయినా సాధ్యమేనన్నారు.కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేశారు.

రాష్ట్రపతి భవన్‌ లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 5వ పాలకమండలి సమావేశంలో మోడీ ప్రారంభ సందేశాన్ని ఇచ్చారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సాధనలో నీతి ఆయోగ్‌ దే కీలకపాత్ర అన్నారు.ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగానిదే కీలకపాత్ర ఉందన్నారు. ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై రాష్ర్టాలు దృష్టి సారించాలని సూచించారు. జలవనరుల వినియోగంలో కొత్తగా వచ్చిన జల్ శక్తి శాఖ సమగ్ర విధానం తెస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నీటి యాజమాన్య పద్దతులు, నీటి సంరక్షణలో రాష్ర్టాలు చొరవ తీసుకోవాలన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపుకి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. ఫిషరీస్,పశు సంవర్థన,ఉద్యాన,పండ్లు,కూరగాయలపై ఫోకస్ చెయ్యాల్సిన అవసరముందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి,రైతులకు సంబంధిన ఇతర కేంద్ర పథకాలు ఖచ్చితమైన సమయంలోపై లబ్దిదారులకు చేరాలని మోడీ తెలిపారు.ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్,వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ,పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హాజరుకాలేదు.

pm modi
NITI AYOG
CHAIRED
meeting
chief ministers
economy
jal shakti
Key Role
Export
importence

మరిన్ని వార్తలు