రిలాక్స్ : దిగివచ్చిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ రేట్లు

Submitted on 5 January 2019
gas petrol diesel rates down

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గు ముఖం పట్టటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వంటగ్యాస్ ధరను కేంద్రం తగ్గించటంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్లయింది. గతేడాది పెట్రోల్ ధర 100 రూపాయలకు, గ్యాస్ ధర వెయ్యిరూపాయలను తాకుతుంది అనుకునే సమయానికి 5 రాష్ట్రాల్లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కూడా పెట్రో ధరలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. మరో వైపు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రం చమురుధరల పెంపుదలపై ఆచితూచి అడుగేస్తోంది. 
గత 4 ఏళ్లుగా పెరిగిన ధరలు తిరోగమనంతో దిగివస్తున్నాయి. హైదరాబాద్ లో గత4 నెలల్లో పెట్రోల్ పై రూ.16.46 పైసలు తగ్గగా, డీజిల్ పై రూ.14.45 పైసలు తగ్గింది. రాష్ట్రంలోని పెట్రోల్ వినియోగంలో సగభాగం హైదరాబాద్ లోనే ఉంటుంది. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా  వాహహనాలు ఉండగా, మరో 10 లక్షల వాహనాలు నగరానికి వచ్చిపోతూ ఉంటాయి. నగరంలో 3 ప్రధాన ఆయిల్ కంపెనీల నుంచి సుమారు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి.

petrol
diesel
lpg
gas
rates
down

మరిన్ని వార్తలు