ఏ మగాడి సాయం లేదు - నా ఇల్లు నా కష్టార్జితం

Submitted on 15 February 2020
Pawan Kalyan ex wife Renu Desai about Rumours

సోషల్ మీడియాలో తనపై రోజుకో రూమర్ పుట్టిస్తున్నారని.. నా ఇద్దరి పిల్లలతో నా బ్రతుకేదో నేను బ్రతుకుతుంటే ఎందుకు నన్ను అకారణంగా అవమానాలకు గురిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరమైన వార్తలతో పవన్ అభిమానులకీ తనకీ గొడవలు పెట్టకండి అని ఆమె అన్నారు.

‘‘నా జీవిత మనుగడ కోసం ఎంతగానో శ్రమిస్తూ, ఒంటరి పోరాటం చేస్తున్నాను. నేనిప్పటి వరకూ నా తండ్రి నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయమూ ఆశించలేదు. అలాగే నా మాజీ భర్త నుంచి అన్యాయపూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అదీ నా వ్యక్తిత్వం! అయినప్పటికీ నా గురించి అన్యాయంగా, అసత్య వార్తలను ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసం’’ అని రేణూ దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో పలు కార్యక్రమాల నిమిత్తం ఆమె హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

Renu Desai

 

ప్రస్తుతం రేణు నివాసం ఉంటున్న ఇంటిని తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ కొనిచ్చారన్న వార్త మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. ‘‘మీరంతా అనుకుంటున్నట్లు హైదరాబాద్‌లో నాకున్న ఫ్లాట్‌ నాకెవ్వరూ కొనివ్వలేదు. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా సొంత ఇల్లు అది. నా మాజీ భర్త కొనిచ్చారన్న అసత్య ప్రచారాల వల్ల నా నిజాయతీకీ, ఆత్మగౌరవానికీ భంగం కలుగుతుందనే ఆలోచన మీకెవ్వరికీ రాదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ, నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధమూ ఉండి ఉండదు.

కనీసం ఈ విషయం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. ఒక వార్త నిజమో, కాదో నిర్ధారించుకోకుండానే తొందరపాటుతో ప్రచురించి ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి వార్తలను ప్రజలు నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం చెదిరిపోదా? అసత్య కథనాల వల్ల నా మనసు ఎంతగానో ఘోషిస్తోంది.

RENU DESAI

 

 

బాధతో చితికిపోతోంది. దయచేసి అర్థం చేసుకోండి! మగాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లుల జీవన గమనానికి గౌరవం ఇవ్వకపోయినా పరవాలేదు. ఇలా కించపరచకండి. నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి..

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం.. 

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ..

ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం..
ఇది మీకు తెలియనిదా’’? అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

Pawan kalyan
Renu Desai
rumours
Gossips
Akira Nandan
Aadya

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు