జగన్ రెడ్డి.. అని పిలిస్తే పవన్ నాయుడు అని పిలుస్తాం

Submitted on 3 December 2019
Pawan Kalyan criticizes Minister Kodali Nani..We call it Pawan Naidu

జనసేన పార్టీని పవన్ కళ్యాన్ బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై మండిపడ్డ కొడాలి నాని..సీఎం జగన్ ను జగన్ రెడ్డి.. అని పవన్ పిలిస్తే అందరూ పవన్ ని పవన్ నాయుడు అని పిలుస్తామని అన్నారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారనీ..మూడు నెలలకు ఒకసారి ఏసీ రూముల్లో పవన్ కార్యక్రమాలు చేసే ఆయన్ని ప్రజలే గుర్తించలేదన్నారు. 

ఇప్పుడు ప్రత్యేకించి జగన్ ను పవన్ గుర్తించాల్సిన అవసరం లేదనీ..ఆయనగారు గుర్తించకుంటే సీఎం పదవిని రద్దు చేస్తారా ఏంటీ అంటూ ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలెవ్వరూ పవన్ ను గుర్తించలేదనీ..అందుకే ఓట్లు కూడా వేయలేదనీ ఆ విషయం ఆయన గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సోనియా గాంధీని జగన్ విమర్శించారు కాబట్టి జగన్ జైలుకు వెళ్లారనీ..పవన్ అలా కాదు..మోదీని అమిత్ షాను పవన్ పొగుడుతుంటారు అందుకే ఆయన జైలుకు వెళ్లరని..ఇలా అస్తమాను బీజేపీని పొగిడే పవన్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ చురకలు అంటించారు.  
 

Pawan kalyan
Minister
Kodali Nani
criticizes
We call it Pawan Naidu

మరిన్ని వార్తలు