ఈ-సిగరెట్ల నిషేధ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Submitted on 2 December 2019
Parliament passes the bill banning e-cigarettes

ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ(నవంబర్-2,2019)రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, వ్యాపారం, రవాణా, నిల్వ, వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ బిల్లు 2019ని లోక్‌సభ గతంలోనే ఆమోదించింది. సెప్టెంబరులో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో దీనిని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ బిల్లు ప్రకారం...ఈ-సిగరెట్లను నిల్వ ఉంచినవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించవచ్చు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘించినవారిని రూ.1 లక్ష జరిమానాతో లేదా ఒక ఏడాది జైలు శిక్షతో లేదా ఈ రెండు శిక్షలతో శిక్షించవచ్చునని ఈ బిల్లు చెప్తోంది. రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షలు జరిమానాతోపాటు మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. 
 
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో ఎంపీల ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ సమాధానమిస్తూ... తాము గొప్ప సదుద్దేశంతో ఈ బిల్లును ప్రతిపాదించామని,తమకు స్వార్థ ప్రయోజనాలేవీ లేవన్నారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు మాట్లాడుతూ పొగాకు లాబీ ఒత్తిళ్ళ కారణంగానే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేశారు. ముడి పొగాకు, సంప్రదాయ సిగరెట్లకు కూడా నిషేధాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ పొగాకును పూర్తిగా నిషేధించగలిగితే ఈ భూమండలంలో సంతోషించే వ్యక్తిని తానేనని అన్నారు.

E-SIGARETTES
Bill
Passes
Parliament
banning
fine
Rajyasabha

మరిన్ని వార్తలు