పార్లమెంట్‌లో జై శ్రీరాం నినాదాలా : ఎంపీ నవనీత్ కౌర్ అసంతృప్తి

Submitted on 17 June 2019
Parliament is not right place to raise 'Jai Sri Ram' slogan

‘పార్లమెంట్‌లో జై శ్రీరాం నినాదాలు చేస్తారా..ఇలా చేయడం సరికాదు..ప్రజా సమస్యలపై మాత్రమే ఇక్కడ చర్చకు చోటు ఉంది’ అంటూ ఎంపీ నవనీత్ వ్యాఖ్యానించారు. ఈమె మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. జూన్ 17వ తేదీ సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 

బీజేపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడంపై ఎంపీ నవనీత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం చేసిన అనంతరం ఆమె ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడారు. ‘జై శ్రీరాం అంటూ నినాదాలు చేయడం కరెక్టు కాదు..వాటి కోసం ప్రత్యేక టెంపుల్స్ ఉన్నాయి..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు..ప్రజా సమస్యలపై మాత్రమే చర్చకు చోటు ఉంది’ అంటూ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు. 

Parliament
right place
raise Jai Sri Ram
Slogan


మరిన్ని వార్తలు